Monday, April 20, 2026

ఏప్రిల్ 2 నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్స రానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశా లకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ 2026 తుది విడత ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 13 రాత్రి 9 గంటలతో ముగిసిన సంగతి పాఠకులకు తెలిసిందే.

తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు ఆన్‌లైన విధానంలో జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షల తేదీలను తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీయే, స్వల్పంగా మార్చింది.తాజా షెడ్యూల్‌ ప్రకారం మొత్తం 8 రోజుల పాటు జరిగే పరీక్షలను 6 రోజులకు కుదించింది. అంటే ఏప్రిల్‌ 2 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వివరించింది.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ JEE మెయిన్ 2026 సెషన్ 2కి సంబంధించిన పేపర్ 1 (BE/ BTech), పేపర్ 2A, 2B (BArch, BPlanning పేపర్లు) పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 8 వరకు కొనసాగించనుంది. ఈ మేరకు అభ్యర్ధులు గమనించాలని సూచించింది.

మరోవైపు సిటీ ఇంటి మేషన్‌ స్లిప్‌లను ఎన్టీయే విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి పరీక్ష జరిగే నగరం సమాచారాన్ని తెలుసు కోవచ్చు. ఇందులో అభ్యర్థులకు పరీక్షా కేంద్రం, నగరం, రాష్ట్రాన్ని మాత్రమే తెలియజేస్తారు. పరీక్షకు సంబంధించిన ఖచ్చిత మైన ఎగ్జాం సెంటర్‌, పరీక్ష తేదీ, షిఫ్ట్ వివరాలను హాల్ టిక్కెట్లలో పేర్కొంటారు.

జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు పరీక్షల ప్రారంభానికి మూడు నుంచి నాలుగు రోజుల ముందు విడుదల చేస్తారు. ఇక జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 2 పేపర్‌ 1(బీఈ/బీటెక్‌) పరీక్షలు 2, 4, 5, 6, 8 తేదీల్లో జరుగుతాయి. పేపర్‌2 (బీఆర్క్‌) పేపర్‌ 2బి(బీప్లానింగ్‌), పేపర్‌ 2ఏ అండ్‌ 2బి(బీఆర్క్‌ అండ్‌ బీప్లానింగ్‌) పరీక్షలు ఏప్రిల్‌ 7న జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular