Sunday, March 22, 2026

కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య?

కరీంనగర్ , నిఘా న్యూస్: కరీంనగర్ టూ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన భార్య ఈనెల 16న సూసైడ్ చేసుకోగా.. ఐదు రోజుల వ్యవధిలోనే ఎస్సై చంద్రశేఖర్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు .

అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కారణం ఏంటో తెలియదు కానీ.. మొదట దివ్య సూసైడ్ చేసుకుంది. విషపూరిత మైన గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు ప్రయత్నిం చగా గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.

గత కొంతకాలంగా దివ్య కడుపునొప్పితో బాధపడు తుందని ఆ నొప్పిని భరించలేకనే సూసైడ్ చేసుకున్న తెలిసింది. అయితే దివ్య అంత్య క్రియల సమయంలో కొందరు గ్రామస్థులు, బంధువులు చంద్రశేఖర్‌పై దాడికి ప్రయత్నించారు. దివ్య మరణానికి ఆయనే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో దివ్య తల్లిదండ్రులే అల్లుడిని కాపాడినప్పటికీ, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య లేదన్న బాధ, సమాజం వేలెత్తి చూపుతుందన్న అవమానం ఆయనను వెంటాడాయి.

భార్య చనిపోయిన ఐదో రోజు కార్యక్రమం కోసం చంద్రశేఖర్ ఇల్లంతకుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింటికి వెళ్లారు. భార్య మరణాన్ని జీర్ణించు కోలేక, మరోవైపు బంధు వుల నుంచి ఎదురైన విమర్శలతో ఎస్సై చంద్రశేఖర్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. అక్కడ భార్య జ్ఞాపకాలు ఆయనను మరింత కలచివేశాయి.

అందరూ ఇంట్లోనే ఉండ గా.. ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎంతసేపటికీ గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా అప్ప టికే ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular