హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి,ఈ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11.45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దే శించి ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమా వేశం నిర్వహించనున్నారు.
ఓకే ప్రాంగణంలోకి శాసన సభ శాసనమండలి సమావేశాలు జరగనున్నా యి. పాత అసెంబ్లీ హాల్లో శాసనమండలి సమావే శాలు నిర్వహిస్తారు. ఉదయం 11.27, గంటల నుంచి 11:37 నిమిషాల సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది.
తెలంగాణ తల్లి విగ్రహం కార్యక్రమానికి శాసన మం డలి శాసనసభ సభ్యులు అందరూ హాజరుకావాలని సూచించారు.గవర్నర్, సిఎం, మండలి చైర్మన్, స్పీకర్ చేతుల మీదుగా ఆవిష్కరణ ఉండనుంది. ఉదయం 11:40 కి అసెంబ్లీ సంయుక్త సమావేశం ప్రారంభమవుతాయి. 11.45కి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగి స్తారు.బడ్జెట్ సమావేశాల్లో హాట్ హాట్ డిస్కషన్స్ జరగనున్నాయి.
సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. వివిధ బిల్లులను ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఆమోదించ నుంది. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ ప్రాంతం లో 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీ భద్రతను మొహరించారు. ఎటువం టి ఆందోళనలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.


