చిత్తూరు, నిఘా న్యూస్: చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై లారీ కిందకు కారు దూసు కెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళుతున్న లారీ కిందకు కారు దూసు కెళ్లింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. కారులోని మృతదేహాలను బయటకు తీసి పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక సమాచారం మేరకు కారు ఓవర్ స్పీడ్‌లో ఉందని.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల లారీ కిందకు దూసు కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధిం చిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


