Monday, March 2, 2026

గెలిచిన వెంటనే హామీ నెరవేర్చిన 20వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి శంకర్

వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడ పట్టణంలోని 20వ వార్డ్‌లో గెలిచిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు బీజేపీ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ బోర్ కలెక్షన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముదిరాజు వీధి మరియు మటన్ మార్కెట్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని కుమ్మరి శంకర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. వార్డులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని కౌన్సిలర్ హామీ ఇచ్చారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular