- -ట్రాక్టర్ డ్రైవర్ మృతి పై పలు అనుమానాలు
– పురావస్తు శాఖ వాళ్ళు ఈ ప్రదేశంలో తవ్వకాలు చేయవద్దని ఆదేశాలు - – గతంలోనూ ఈ ప్రదేశంలో నిధులు స్వాధీనం చేసుకున్న పురావస్తుశాఖ
కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ శివారులోని గుట్ట బోర్లలో సర్వే నెం. 1090 లో నిధులు లభించాయా అనే చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు.. ఈనెల 24 తేదీన ఆ గుట్ట బోర్లలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. మట్టిని ట్రాక్టర్ లో తరలిస్తుండగా స్తంభం పెళ్లి అనుబంధ గ్రామమైన కొత్తపల్లి కి చెందిన ఆవునూరి రమేష్ అనే ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు అని పోలీసులు చెబుతున్నప్పటికీ దీనిపైన పలు అనుమానాలు ఇప్పుడు గ్రామంలో రేకెత్తుతున్నాయి. మట్టి తవ్వకాలు చేస్తున్నప్పుడు నిధులు లభించాయని, దానిని చూసిన ట్రాక్టర్ డ్రైవర్, జెసిబి ఓనర్, ట్రాక్టర్ ఓనర్ లకు మాత్రమే ఈ విషయం తెలుసని, ఈ క్రమంలోనే డ్రైవర్ రమేష్ మృతి చెందాడని అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్ట వద్దని గతంలో పురావస్తు శాఖ బోర్డులను ఏర్పాటు చేసింది. ఇదే గుట్టకు రోడ్డు నిమిత్తం ప్రభుత్వం మట్టి కోసం తవ్వకాలు చేపట్టినప్పుడు నిధులు వెలువడిన విషయం తెలిసిందే. అట్టి ప్రదేశంలో తవ్వకాలు చేపట్టిన సందర్భంలో నిధులు వెలువడ్డాయనే చర్చ జోరుగా సాగుతోంది.


