–పునరాలోచనలో కాంగ్రెస్ క్యాడర్
-వెలిచాల రాజేందర్ పూర్తిస్థాయిలో పనిచేసిన కానవారి ఫలితం
-మిగతా మంత్రులు నామమాత్రంగా కరీంనగర్లో ప్రచారం
కరీంనగర్ టౌన్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు కాంగ్రెస్కు కలిసి రాలేదు. కేవలం 14 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఆ క్యాడర్ పునర్ ఆలోచనలో పడింది. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న వెలిచర్ల రాజేందర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఎఫర్ట్ పెట్టారు. 66 డివిజన్లలో తాను ఒక్కడే బాధ్యతలను భుజాలపై వేసుకొని పని చేశారని కిందిస్థాయి క్యాడర్ చర్చించుకుంటుంది. మిగతా కాంగ్రెస్ మంత్రులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో కరీంనగర్లో పని చేయలేదని అందువలనే కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలోకి రాలేదని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. అంత కుట్రపూరితంగానే మిగతా నాయకులు ఎవరు కరీంనగర్లో పనిచేయలేదని, అందుకే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వెలిచాలకు నియోజకవర్గ ఇన్చార్జి ఇవ్వడంతో కొంతమంది నాయకులు కావాలనే ఇక్కడ పని చేయలేదని అందువల్లే ఈ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. అయినప్పటికీ వెలిజాలకు బాధ్యతలపై ఇవ్వడంతో కాంగ్రెస్కు కార్పొరేషన్ లో కొంత సానుకూలత వచ్చిందని దానిని పూర్తిస్థాయిలో ఓటుగా పిలుచుకోవడంలో సక్సెస్ కాలేదని చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కరీంనగర్ కార్పొరేషన్ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చెప్తున్నారు.


