Thursday, February 26, 2026

కరీంనగర్ కార్పొరేషన్ లో 35కు చేరిన బీజేపీ బలం

చక్రం తిప్పిన బండి సంజయ్

మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

66 స్థానాలకుగాను 30 సొంతంగావిజయ కేతనం

ఫలితాల వెలువడ్డ కొద్దిసేపటికే 4గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్ బి కార్పొరేటర్ బీజేపీలో చేరిక

రేపు మరో 5 గురు కార్పొరేటర్లు చేరే అవకాశం

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 66 స్థానాలకు గాను బీజేపీ సొంతంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితాలు వెలువడిన వెంటనే 13వ డివిజన్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన తెల్ల లక్ష్మీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోట చేసి గెలిచిన విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. వీరిద్దరూ కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి విచ్చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

ఆ తరువాత కొద్దిసేపటికే ఇద్దరు బీజేపీ రెబల్ కార్పొరేటర్లు, మరో ఇండిపెండెంట్ సైతం బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో బీజేపీ సంఖ్య 35కు చేరుకుంది.

వాస్తవానికి కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేటర్ల సంఖ్య 66. వీరితోపాటు స్థానిక ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్(బీఆర్ఎస్) కవ్వంపల్లి సత్యనారాయణ(కాంగ్రెస్), ఎంపీ బండి సంజయ్ (బీజేపీ) ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 69కి చేరనుంది. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 35 కావాలి. బీజేపీ ఇప్పటికే 35కు చేరుకుంది. అవసరమైతే మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య సైతం అవసరమైన పక్షంలో ఎక్స్ అఫీఫియో సభ్యులుగా చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ అవసరం పడే అవకాశాలు కన్పించడం లేదు. ఎందుకంటే మరో 5 గురు ఇండిపెండెంట్, ఏఐబీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. శనివారం వారంతా బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular