– అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
– ఏఎస్పీ రుత్విక్ సాయి వెల్లడించారు.
వేములవాడ జనవరి,నిఘాన్యూస్:బోయినపల్లి మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన గండి శ్రీధర్ (S/o పోచయ్య) అదే గ్రామానికి చెందిన సావనపెల్లి శశి ప్రీతమ్ (S/o వెంకటేష్)పై తేదీ 07-01-2026 రోజున బోయినపల్లి మండలం దేశాయిపల్లి శివారులో కత్తితో దాడి చేసినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపారు. ఈ దాడిలో బాధితుడు శశి ప్రీతమ్‌కు రక్తగాయాలు కావడం జరిగిందన్నారు.
బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. నమ్మకమైన సమాచారం మేరకు నర్సింగపూర్ గ్రామ శివారులో ఉన్న నిందితుడు గండి శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కత్తి, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
నిందితుడిని ఈరోజు న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.
చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.


