Friday, February 27, 2026

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు!

వరంగల్, నిఘా న్యూస్:రెండేళ్లుగా నీరు రావడం లేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చారు.వరంగల్ జిల్లా మున్సిపా లిటీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రెండేళ్లు నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మహిళలు మంగళవారం రోడ్డు ఎక్కారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. ప్రత్యామ్నాయం గా మున్సిపల్ సిబ్బంది నీటి సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

నీటి సమస్య తీవ్రమవడం తో మంగళవారం ఖాళీ బిం దెలతో నిరసన చేపట్టారు. నీరు రావడంలేదని మున్సి పల్ కార్పొరేటర్లకు,మంత్రి సురేఖకు విన్నవించుకున్న ఏ ఒక్క అధికారి మా నీటి సమస్య పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.త్రాగునీరు రాకపోవడం వల్ల బయట నుంచి నీళ్లు కొనుక్కొని తాగుతున్నా మని, వారు వాపోయారు. ఏండ్ల తరబడి నీరు లేకుంటే ఊళ్లో ఎలా ఉండాలని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ మా ఊరి నీటి సమస్య తీర్చాలని వారు అధికారులను కోరారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular