Friday, February 27, 2026

సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు

హైదరాబాద్,నిఘాన్యూస్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా మరో పదకొండు రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో రైల్వే శాఖ తెలిపింది, ఈ సదుపాయం రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ – విజయవాడ మార్గంలో నడిచే మరో పదకొండు అదనపు ఎక్స్ప్రెస్ రైళ్లకు చర్లపల్లి లో ప్రత్యేక హాల్ట్ లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది,

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఆగనున్న రైళ్లు!
మచిలీ పట్నం- బీదర్ ఎక్స్‌ప్రెస్, నర్సపూర్- లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి, కాకినాడ టౌన్- లింగంపల్లి గౌతమి, సాయినగర్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, సాయిన గర్ – కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం – ముంబై ఎన్టీటీ ఎక్స్‌ప్రెస్, మచిలీ పట్నం – సాయినగర్, కాకినాడ – సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- కాకినాడ టౌన్ కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం – లింగంపల్లి జన్మభూమి, ముంబై- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – నర్సాపుర్ ఎక్స్‌ప్రెస్, బీదర్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆగే రైళ్లు

సికింద్రాబాద్- గూడూరు- సికింద్రాబాద్ సింహపురి, కాకినాడ- లింగంపల్లి- కాకినాడ గౌతమి, కాకినాడ- లింగంపల్లి- కాకినాడ కాకినాడ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ గరీభ్‌రథ్, సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ, హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి, తిరుపతి- సికింద్రాబాద్- తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈనెల 20వ తేదీ వరకు ఆగనున్నాయి

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular