Thursday, February 26, 2026

మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు

  • మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల (నిఘా న్యూస్): మున్సిపల్ ఓటర్ జాబితాలో పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆయా మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మున్సిపాలిటీల పరిధిలో వార్డు వారీగా, ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్ల జాబితాను మున్సిపల్ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ప్రచురించినట్లు తెలిపారు.
ఎవరికైనా తమ ఓటు తమ ఇంటి నంబర్‌కు అనుగుణంగా కాకుండా ఇతర వార్డులో నమోదై ఉంటే, వారు ఈ నెల 09వ తేదీలోగా లిఖిత పూర్వకంగా సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆయా వార్డులకు సంబంధించిన ఓటర్ జాబితా హెల్ప్ డెస్క్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఇదే అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular