Thursday, February 26, 2026

మళ్లీ బ్యాలెట్ పేపర్ తోనే మున్సిపల్ ఎన్నికలు?

హైదరాబాద్, నిఘా న్యూస్: మునిసిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఎన్నికలు జరిగే 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు పరిధిలో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించింది,

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు మున్సిపల్ ఆఫీసర్లు బ్యాలెట్ పేపర్ కోసం పేపర్ కంపెనీలకు ముందస్తు ఆర్డర్లు పంపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు వెంటనే ముద్రించి అందించే లా పేపర్ ను రెడీ చేసి పెట్టు కోవాలని, ఆదేశించారు.

2014లో ఈవీఎంలతో, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సారి కూడా బ్యాలెట్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర సామగ్రిని సిద్ధం చేసుకోవా లని అధికార యంత్రాంగా నికి సూచనలు అందినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇటీవల కాలంలో ఎన్నికల నిర్వహణ విధానంపై జరుగుతున్న చర్చల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గా ల్లో ప్రచారం జరుగుతోంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లకు అవగాహన మరింత స్పష్టంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అదే సమయంలో ఎన్నికల సిబ్బంది నియామకం, లెక్కింపు ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందనే అభిప్రాయం కొంతమంది రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

అయితే బ్యాలెట్ విధానం తో ఎన్నికలు నిర్వహించ డంపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ సమయం పడటం, మానవ తప్పిదాలకు అవకాశం ఉండటం వంటి అంశాలను ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావి స్తున్నాయి. మరోవైపు ఈవీఎంలపై ఉన్న అనుమానాల నేపథ్యంలో బ్యాలెట్ విధానమే ఉత్తమమన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular