కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గట్టు నమిత – సురేష్ కు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. సమస్యలను దగ్గరగా చూసిన వీరు ప్రతి ఇంటి అవసరాన్ని అర్థం చేసుకునే వారికి అందుబాటులో ఉంటానని మాట ఇస్తున్నారు. మాటల్లో కాదు – చేతల్లో చూపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పలపల్లి గ్రామంలోని నాలుగవ వార్డులో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం అని అంటున్నారు. ఈ వీధిలో సీసీ రోడ్లు, పక్కా డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. వర్షాకాలంలో నీటి నిల్వలతో ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే వారి ఆశయం.పేదలు, మహిళలు, వృద్ధులు, యువత—అందరికీ సమాన న్యాయం అందేలా పనిచేస్తామని గట్టు నమిత–సురేష్ మాటిస్తున్నారు. మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం, యువతకు క్రీడా సదుపాయాలు, విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడంలో వీరు ముందుంటామని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పారదర్శకంగా అమలు చేయడమే తమ ధ్యేయమని అంటున్నారు.

ఇప్పలపల్లి గ్రామం అభివృద్ధి చెందాలంటే నిజాయితీగల ప్రతినిధులు అవసరం.. సమస్య వచ్చినప్పుడు స్పందించే వారు, ప్రజల మధ్యే ఉండి పరిష్కారం చూపించే వారు కావాలి.. ఆ నమ్మకాన్ని మేము నిలబెడతామని అంటున్నారు. ప్రతి సమస్యపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.మన వార్డు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అభివృద్ధి, ఐక్యత, పారదర్శక పాలన కోసం సరైన నిర్ణయం తీసుకునే సమయం ఇది. ఇప్పలపల్లి గ్రామం 4వ వార్డు అభ్యర్థులు గట్టు నమిత–సురేష్‌లను భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరుతున్నారు.


