సర్పంచ్ బరిలో చీకట్ల శ్రీనివాస్
అభివృద్ధి ధ్యేయమే లక్ష్యం
కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి సమస్యలతో బాధపడుతున్న రాగంపేట గ్రామం ఇప్పుడు స్థానిక ఎన్నికలతో కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. రోడ్లు దెబ్బతినడం, డ్రైనేజీలు మూసుకుపోవడం, తాగునీటి సరఫరాలో లోపాలు… ఇలా గ్రామస్తులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యలకు ఎప్పటినుండో పరిష్కారం కనిపించకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో గ్రామ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గతంలో అధికారంలో ఉన్న నాయకులు అభివృద్ధిపై సరైన దృష్టి పెట్టలేదని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోఈసారి అభివృద్ధి మంత్రమే నినదిస్తోంది.
స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి జర్నలిస్టు చీకట్ల శ్రీనివాస్
ఈసారి సర్పంచ్ బరిలో చర్చనీయాంశంగా నిలుస్తున్న పేరు జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్.మీడియా రంగంలో పనిచేస్తూ, రాగంపేట గ్రామ సమస్యలను తరచూ వెలుగులోకి తెచ్చిన ఆయన, గ్రామ అభివృద్ధికి గతంలో అనేకసార్లు స్వయంగా మధ్యవర్తిత్వం కూడా చేశారు. ఇప్పుడు ప్రజల ఆశీస్సులతో అధికారిక ప్రతినిధిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.“గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మార్చడం నా లక్ష్యం”అని అంటున్నారు. అలాగే ప్రధాన రహదారుల పునర్నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం, తాగునీరు, విద్యుత్ సమస్యల నివారణ వంటి కార్యక్రుమాల చేపడుతానని శ్రీనివాస్ అంటున్నారు.
గ్రామంలో కొత్త నాయకత్వం రావాలన్న కోరిక ఈసారి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పాత నాయకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ “ఈసారి గ్రామం గురించి ఆలోచించే వారిని ఎన్నుకోవాలి”
అంటూ గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా చీకట్ల శ్రీనివాస్ రంగప్రవేశంతో రాగంపేట ఎన్నికలు మరింత హోరాహోరీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అభివృద్ధిని అజెండాగా పెట్టుకున్న ఈ ప్రచారం ఎంతవరకు ప్రజలను ఆకర్షిస్తుందో… సర్పంచ్ పోటీ ఫలితం ఏ దిశలోకి మారుతుందో గ్రామంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


