కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సయాయక సంఘాలకు వడ్డీలేని ఋణాలు విడుదల చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాకు 11401 సంఘాలకు 11.18 కోట్లు మంజూరీ కాగా నియోజకవర్గం వారిగా ఈ రోజు వడ్డీ లేని ఋణాల మంజూరీ పై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి సంఘ సభ్యులకు పంపిణి చేయడం జరిగినది. హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించి హైదరాబాద్ లో 1524 సంఘాలకు 1.52 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాల చెక్కులు గౌ,, మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా సంఘ సభ్యులకు పంపిణి చేయడం జరిగినది. మానకొండుర్ నియోజకవర్గం సంబంధించి రైతువేదిక, మానకొండూర్ నందు, 3343 సంఘాలకు 3.35 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాల చెక్కులు నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మండల అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల ఆద్వర్యములో సంఘ సభ్యులకు పంపిణి చేయడం జరిగినది.
హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించి MPDO కార్యాలయం, హుజురాబాద్ నందు, 2708 సంఘాలకు 2.55 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాల చెక్కులు నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మండల అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల ఆద్వర్యములో సంఘ సభ్యులకు పంపిణి చేయడం జరిగినది. చొప్పదండి నియోజకవర్గం సంబంధించి రైతువేదిక, గంగాధర నందు, 2596 సంఘాలకు 2.50 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాల చెక్కులు గౌ, నియోజక వర్గ MLA గారు, మండల అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల ఆద్వర్యములో సంఘ సభ్యులకు పంపిణి చేయడం జరిగినది. కరీంనగర్ నియోజకవర్గం సంబంధించి MPDO కార్యాలయం, కరీంనగర్ నందు, 1230 సంఘాలకు 1.26 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాల చెక్కులు అదనపు జిల్లా కలెక్టర్ (లోకల్ బాడీస్), మండల అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల ఆద్వర్యములో సంఘ సభ్యులకు పంపిణి చేయడం జరిగినది.


