Friday, February 27, 2026

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా బాలల దినోత్సవం

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్వా విలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్, అల్ఫోర్స్ టైనీ టాట్స్, అల్ఫోర్స్ ప్రైమరీ క్యాంపస్, మంకమ్మతోటలోని అల్ఫోర్స్ ప్లానెట్ కిడ్స్, భగత్ నగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల, కిసాన్ నగర్ లోని అల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుక ప్రారంభానికి ముందు వారు ప్రాంగణాల్లో ఏర్పాటు చేసినటువంటి నెహ్రూ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు వినోదాత్మక కార్యక్రమాల నిర్వాహణ ద్వారా వారిలో దాగివున్న ప్రతిభను వెలికితీయవచ్చని మరియు చదువులో ఆసక్తి పెంపొందించగలుగుతామని తెలుపుతూ ప్రతి విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు సాధన చేసి పలు పరీక్షలలో విజేతలుగా ఉండాలని సూచించారు. పండిట్ నెహ్రూ గారు పిల్లలకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని మరియు పిల్లల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయింపు ఎంతో అవసరమని వారు తెలిపారని గుర్తు చేశారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రధానంగా చిన్నారులకు వినోదాత్మకంగా విద్యను అందిస్తున్నామని మరియు చదువులో ఆసక్తి పెంపొందించడానికి పలు వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నామని చెప్పారు‌

బాలల దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి “హమారా చాచా నెహ్రూ – హమారా పండిట్ నెహ్రు” “మేము బాలలం- భవిష్యత్తుకు పునాదులం” నృత్యాలు చాలా ఆకర్షణంగా నిలిచాయి. పలువురు విద్యార్థులు నెహ్రూ వేషధారణలో విచ్చేసి ఉత్సవాలకు మరింత వన్నె ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు,

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular