Friday, February 27, 2026

కొండగట్టు జేఎన్టీయూ లో ర్యాగ్గింగ్ పై విచారణ జరిపించాలి: చీకట్ల శ్రీనివాస్

కరీంనగర్, నిఘా న్యూస్: నాచుపల్లి శివారులో గల కొండగట్టు జేఎన్టీయూ క్యాంపస్ లో సీనియర్ విద్యార్థులు, బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఘటనపై యూనివర్సిటీ, పోలీస్ అధికారులతో విచారణ జరిపించాలని జర్నలిస్టు జాతీయ సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఇద్దరు జూనియర్ విద్యార్థుల చేత పెళ్లి చేస్తున్నట్లు తంతు జరిపించి, చున్నీలు వేసుకుని డ్యాన్స్ చేసి, ఈ తంగాన్ని వీడియో చిత్రీకరించి, సీనియర్ విద్యార్థులు పోస్ట్ చేసి వైరల్ చేశారన్నారు. ఈ వికృత సంఘటన వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన జరిగి నాలుగు రోజులు గడిచి, ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ అధికారుల చర్యలు తీసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. క్యాంపస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇటీవల కాలంలో విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించాడని విద్యార్థుల ఆందోళన కూడా చేశారన్నారు. క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ విఫలం కావడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. వెంటనే యాంటీ ర్యాగ్గింగ్ కమిటి ని ఏర్పాటుచేసి, ర్యాగ్గింగ్ ని పూర్తిగా నిరోధించాలన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular