హైదరాబాద్, నిఘా న్యూస్: రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేవలం 17 సంవత్సరాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన విప్లవాత్మక నాయకుడు అనుముల రేవంత్ రెడ్డి, 2006లో మహబూబ్నగర్ జిల్లా మిడ్జెల్ జడ్పిటిసిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం 2023 డిసెంబర్ 7న తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నవంబర్ 8న 57 ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నారు. సీఎం జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందు నుండే ఆయనకు అత్యంత వినూత్న రీతిలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి 57వ జన్మదినాన్ని పురస్కరించు కుని, తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సృజనాత్మకంగా ఒక బహుమతిని అందించారు.సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి 57 కిలోల సన్నబియ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటాన్ని బర్త్ డే గిఫ్ట్‌గా అందించారు.
రేవంత్ రెడ్డి పేదల కోసం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని గుర్తుచేసేలా ఈ కానుకను రూపొందించడం ఇప్పుడు విశేషంగా నిలిచింది. పేదలకు కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ఈ చిత్రపటాన్ని తయారు చేయించినట్లు మెట్టు సాయికుమార్ తెలిపారు.
ప్రజా సమస్యలు విన్న వెంటనే స్పందించే నేతగా రేవంత్ రెడ్డి,మంచి మానవత గుణాలను ఆచరిస్తున్నారు ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే స్వభావం ఆయనను మాస్ లీడర్ గా నిలబెట్టింది, పేద ప్రజలందరికీ తన ప్రభుత్వం ఉన్నదనే భరోసా కలిగిస్తున్నాడు. 17 ఏళ్ల ప్రయాణంలో ఆయన చేసింది తరతరాలకు ప్రేరణ రాజకీయాల్లో కష్టపడితే లక్ష్యాలు సుసాధ్యమవుతా యనే సజీవ సాక్ష్యం అనుముల రేవంత్ రెడ్డి,
నేడు సీఎం రేవంత్ రెడ్డి,జన్మదినం ఆయనకు తెలంగాణ ప్రజల అభినందనలు,అభిమానం ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటూ
మీ చీకట్ల శ్రీనివాస్
జర్నలిస్టు, (కలాం నిఘా)
జర్నలిస్టు జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు



