ఖమ్మం, నిఘా న్యూస్ : ఖమ్మం వేదికగా తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20న జరిగే ముస్లిం ధార్మిక సభను జయప్రదం చేయాలని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మౌలానా షేక్ ముజాహిద్,తెలంగాణ ముస్లిం ఐక సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ హుస్సేన్ సాహెబ్ తెలిపారు.ఈ ధార్మిక సభకు హజ్రత్ మౌలానా మెహమ్మద్ ఉస్మాన్ సాహెబ్ రహ్మనీ ద్యన్వీ
షాహి ఇమామ్ పంజాబ్,హజ్రత్ మౌలానా ముహిబుల్లా సాహెబ్ నద్వీ రాంపూర్ పార్లమెంట్ సభ్యులు,ఉత్తరప్రదేశ్ హాజరై మహమ్మద్ ప్రవక్త సందేశం ప్రసంగిస్తారని తెలిపారు.

అలాగే వివిధ రాష్ట్రాల నుంచి మరి కొంత మంది గురువులు హాజరై ప్రసంగించినట్లు తెలిపారు.ఈ సభలో వేలాదిగా పాల్గొని సభలో గురువులు ప్రసంగించే మానవాళికి సూచించిన మహమ్మద్ ప్రవక్త సూచనలు సందేశాన్ని విని ఆ సూచనలని ప్రతి ఒక్కరూ ఆచరణలోకి తీసుకుంటే మనిషి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు.


