కరీంనగర్, నిఘా న్యూస్: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం కరీంనగర్ (ఎల్.వి.ఆర్.పి) లోని లక్ష్మీనగర్, వాసవి నగర్, రాఘవేంద్ర నగర్, పోచమ్మ వాడకాలనీల ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నూతన కార్యవర్గo ప్రమాణ స్వీకారోత్సవo, వనభోజనాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కన్న కృష్ణ, జిల్లా ఆర్యవైశ్య మహాసభ, వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిదుర సురేష్, వాసవి వృద్ధాశ్రమం అధ్యక్షులు సామ నారాయ ణ, జిల్లా ఆవోప అధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ట్రస్టు చైర్మన్ చిట్టి మల్ల శ్రీనివాస్, పట్టణ అవోపా అధ్యక్షులు నలుమాచు సుదర్శన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగునూరి రాజేందర్ లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆర్య వైశ్య జిల్లా సంఘం ముఖ్య నాయకులు, అతిథుల సమక్షంలో రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న నూతన కార్యవర్గo ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు.
కరీంనగర్ లోని (లక్ష్మీనగర్, వాసవి నగర్, రాఘవేంద్ర నగర్, పోచమ్మ వాడ) ల ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం (ఎల్.వి.ఆర్. పి) నూతన కార్యవర్గo అధ్యక్షులుగా గుడిసె రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా దొంతుల పవన్ కుమార్, కోశాధికారిగా బొడ్ల శ్రీశైలం, అదనపు కార్యదర్శిగా కొంజర్ల నవీన్ కుమార్, పిఆర్ఓ గా పెద్ది రమేష్ తో పాటు 20 మంది గౌరవ సలహాదారులుగా, 20 మంది ఉపాధ్య క్షులుగా, 20 మంది సంయుక్త కార్యదర్శు లుగా, 20 మంది కార్యవర్గ సభ్యుల చేత వారి పదవి బాధ్య తలకు ప్రమాణస్వీ కారోత్సవాన్ని చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కన్న కృష్ణ, ఎన్నికైన నూతన అధ్యక్షులు గుడిసె రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… సమాజంలో ఆర్యవైశ్యులకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని, ఆర్యవైశ్యులు ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సేవా కార్య క్రమా ల్లో ఎప్పుడు ముందు వరుసలోనే అనే ఉంటారని అన్నారు. ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారం,వాణిజ్యం సేవా కార్యక్రమాల్లో కాకుండా ప్రజాసేవ, రాజకీయ రంగంతో పాటు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షిస్తూ పిలుపు నిచ్చారు. ప్రతి ఆర్యవైశ్యడు సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని అన్నారు.
ఆర్యవైశ్యులంతా ఒకరికొకరు సహాయ,సహకారాలు అందించుకోవాలని, ప్రతి సంఘానికి జిల్లా ఆర్యవైశ్య సంఘం సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరినీ ఘనంగా శాలువాలతో సత్కరించి వారికి మెమోటోలు అంద జేశారు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రధానం చేశారు. సామూహిక వనభోజనా ల్లో భాగంగా ఆర్యవైశ్యుల కుటుంబ సభ్యులందరికీ విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు సిరిపురం నాగభూషణం, నేతి రవి కుమార్, బండ కృష్ణమూర్తి లతో పాటు వైశ్య సంఘం రాష్ట్ర,జిల్లా,పట్టణ నాయకులు, లక్ష్మీనగర్, వాసవి నగర్, రాఘవేంద్ర నగర్, పోచమ్మ వాడల్లోని సుమారు 400 మంది ఆర్యవైశ్యల కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు, కులస్తులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.