Thursday, March 5, 2026

జోష్ నింపిన అల్పోర్స్ ‘బ్లింక్ ‘

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ లోని వావిలాలపల్లి అల్ఫోర్స్ పాఠశాల ప్రాంగణంలో ” బ్లింక్” పేరుతో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు అలరించాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి చదువుల తల్లి జ్ఞానసరస్వతి మాత విగ్రహానికి పూలమాల వేసి విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు కళల వైభవాన్ని విశ్లేషించి చెప్పాలని తద్వారా వారికి కళల పట్ల ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన ఉండాలని మరియు అందులో పాల్గొనడానికై ఎంతగానో ఆసక్తి తో ఉండాలని తెలుపుతూ వాటిపట్ల దృష్టి సారింపచేయాలని కోరారు. మన దేశచరిత్ర విభిన్న కళలకు విశిష్టమైనదని గుర్తుచేస్తూ మనదేశంలో ఉన్నటువంటి కళలు సాంప్రదాయాలు మరేదేశంలో లేవని చెప్పారు .అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ప్రణాళికబద్ధంగా విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభను సృజనాత్మకతను వెలికితీయడానికై తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కృషి చేయడం చాలా గొప్ప విషయమని మరియు వారికి కావలసినటువంటి వనరులను కల్పించి అద్భుతాలు చేస్తూన్నారని తెలిపారు. విద్యార్థులకు గత 35 సం||లుగా నాణ్యతమైన విద్యనందించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని మరియు మీ సహాయసహాకారాలతో అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరిన్ని అద్భుత విజయాలను నమోదు చేస్తూందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి “జనని జనని”, “ఛలో…ఛలో వచ్చిందమ్మా…ఆనందం తెచ్చిందమ్మ”, “స్నేహితుడా… ఓ స్నేహితుడా”, “ఓయ్ బాటసారి.. చూద్దామా మన వేడుకలను చాలా ఆకర్షించాయి. విద్యార్థులు చేపట్టినటువంటి నవ్వుతో జబల్దస్త్ కార్యక్రమం కడుపారా నవ్వింపజేసింది. అదే విధంగా వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహింపబడిన వివిధ ప్రతిభపాటవ పోటీలలో మరియు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసి శుభాభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular