కరీంనగర్, నిఘా న్యూస్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ సమావేశాన్ని బుధవాన్ని నిర్వహించారు. స్థానిక జ్యోతినగర్ లోపి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు. మరియు అమలు చేయబోతున్న వాటి గురించి మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేడు రాజీవ్ యువ వికాసం, బీసీ,ఎస్సీ,ఎస్టీ కులాల సవరణ బిల్లు ఆమోదం మరియు రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల మరియు మొదలగు వాటి గురించి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో చర్చించారు. సమావేశంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ.పురుమల్ల శ్రీనివాస్ గారు, కరీంనగర్ రూరల్ మండలం అధ్యక్షుడు కంరెడ్డి రాంరెడ్డి , కొత్తపల్లి మండల అధ్యక్షుడు పంజాల స్వామి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిని తిరుపతి, కరీంనగర్, కొత్తపల్లి మండలాల అన్ని గ్రామాల అధ్యక్షులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం..
RELATED ARTICLES


