- ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీలో విభేదాలు.
- క్యాడర్లో తీవ్ర నిరాశ
- ఆడియోలో లీకుతో మరోసారి రోడ్ ఎక్కిన హస్తం పార్టీ
కరీంనగర్ , నిఘా న్యూస్: హస్తంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసిన డబ్బులపై కాక రాజేస్తుంది. ఆ పార్టీకి చెందిన వాట్సప్ గ్రూపుల్లో పలువురు పెట్టిన ఆడియోలు కలకలం రేపుతున్నాయి. బూతుల వారిగా హస్తం పార్టీ నాయకులు డబ్బుల పంపిణీలో పలు విభేదాలకు కావిస్తోంది. ఆడియోలో పేర్కొన్న వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..
’’నగరంలో ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ లు 44 ఏర్పాటు చేశారు. వీటిల్లో 11 బూత్లకు ఒకరు చొప్పున నలుగురు పార్టీ సీనియర్లకు ఇన్ చార్జిబాధ్యతలు అప్పగించారు. ఆయా ఇన్చార్జిల ద్వారా పోలింగ్ బూత్కు రూ.50వేలు కేటాయించా రని ఆడియోల్లో పేర్కొన్నారు. ఈ రూ.50 వేలను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమకు కాకుండా, కొత్తగా వచ్చిన వారికి అప్పగించారనేది ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న తమను డబ్బుల విషయానికి వచ్చే ‘బిచ్చగాళ్లారా మీరు పైసలు తినడానికి సిగ్గు ఉందా మీకు.. చిన్నచిన్న కార్యక ర్తల పైసలు రూ.10 వేలు, రూ.20 వేలు తినడానికి బుద్ధి ఉందా… మాకు ఒక్క రూపాయి రాకుండా చేసిండ్రు. ఎవడైతే పైసలు పంచిండ్రో… ఆళ్లకు బుద్ధి.. జ్ఞానం ఉందారా.. మా పైసలు తీసు కొని బిల్డింగ్లు కడుతార్రా…’‘
పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీం ‘నగరం’లోని వివిధ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ కేడర్ ఆక్రందన ఇది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు రావాల్సిన డబ్బులు ఇతర నాయకులకు ఇచ్చారంటూ. మండిపడుతూ ఆయా డివిజన్ల సీనియర్ కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపుతోంది. పోలింగ్ సందర్భంగా డివిజన్లకు కేటాయించిన డబ్బులను తమకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకుల ఆడియోలు కాంగ్రెస్ పార్టీ వాట్సప్ గ్రూప్ ల్లో వైరల్ గా మారాయి.
ఆడియోలు వైరల్
అయితే పోలింగ్ బూత్ల వారీగా ఇచ్చిన డబ్బులు తమకు ఇవ్వకుండా కొంతమంది తీసుకొన్నారని పేర్కొంటూ ఆరోపణలు చేసిన పలువురి ఆడి యోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయా డివిజన్లకు చెందిన మహిళా, బీసీ, మైనార్టీ నాయకులు తమ ఆవేద నను వాయిస్ రికార్డు చేసి, పార్టీ వాట్సప్ గ్రూప్ పోస్ట్ చేశారు. ఆ ఆడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వేగంగా చక్కర్లు కొడు తున్నాయి. డబ్బులు తీసుకున్న వారిని ఉద్దే శిస్తూ ఒకరు తిట్ల దండకం అందుకోగా, మహిళలను పక్కనపెట్టారని, తమకు డబ్బులెందుకివ్వరం టూ ఆయాడివిజన్ల పార్టీ క్యాడర్ మండిపడుతోంది. దీంతో పార్టీలో పెను దుమారం రేపుతో ఉంది.
హస్తంలో లుకలుకలు…
రాష్ట్రంలో అధికార పార్టీ అయినా కరీంనగర్ లో అనాథగా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నిక అగ్నికి ఆజ్యం పోసింది. ఇప్పటికే పార్టీని పట్టించు కునే వాళ్లు లేక నగరంలో ఎవరి గ్రూపు వారిదన్న ట్లుగా పరిస్థితి తయారైంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ డ బ్బుల పంపిణీ వర్గపోరును కాస్తా బజారునపడేసిం ది.
బాధితుల ఆవేదన…
‘డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్తన్న, మంత్రి పొన్నమన్న. నరేందరన్న.. పురుమళ్ల శ్రీనన్న గార్లకు నమస్కారం.. సిటీ కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనపడేస్తున్నారు. మేం పార్టీకి పనిచేయలేదా అన్నా. ఎన్నికలనేసరికి మమ్మల్ని పక్కన పెడుతు న్నరు. మా సొంత ఖర్చులతో పనిచేస్తున్నం. కార్య కర్తలను దెబ్బతీస్తే పార్టీ ఎట్ల గెలుస్తదన్నా. దీని మీద చర్య తీసుకోవాలి.’ అంటూ ఈ నాయకులు ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, నియో జకవర్గ ఇన్చార్జీల పేర్లను ప్రస్తావిస్తూ తమ ఆవే దనను వెళ్లగక్కారు. అంతేకాకుండా పార్టీ నాయ కులు కొంతమందికి ఎమ్మెల్సీ అభ్యర్థి రూ.50 వేలు ఇచ్చినట్లు తెలిసిందని, కానీ తమలాంటి నికార్సయిన కార్యకర్తలకు రూ.50 వేలు ఎం దుకు ఇవ్వలేకపోయారంటూ ఓ మహిళా కార్య కర్త పార్టీ నాయకత్వాన్ని నిలదీశారు. పైసలు తిన్న నాయకులు వెంటనే డబ్బులు తిరిగి తమ కివ్వాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున లొల్లి పెడు తామంటూ ఓ కార్యకర్త వాట్సప్ గ్రూప్ హెచ్చరించారు.
ఆంధ్ర విద్యాసంస్థల కుట్ర..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని ప్రయత్నం జరిగినట్లు ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. పలువురు ఆంధ్ర విద్యాసంస్థలకు చెందిన వారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ నాయకులకు విందులు విందులు ఇచ్చారని, డబ్బులు ముట్ట చెప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీలోనే పలువురు ఇతరులకు కోవర్టుగా పనిచేశారని తెలుస్తోంది. దీంతో హస్తం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలు అంతర్గత విభేదాలు బయటపడినట్లు స్పష్టమవుతోంది.


