కరీంనగర్, నిఘా న్యూస్ :కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చిన్నమెలి అంజిరెడ్డి గెలుపొందారు. గత మూడు రోజులుగా ఎంతో ఉత్కంఠతో జరిపిన కౌంటింగ్ తో చివరికి హోరాహోరీగా సాగింది. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ఈ ఎన్నికలో చివరికి ఇద్దరి మధ్య పోటీ ప్రధానంగా సాగింది. కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో బిజెపి అభ్యర్థి చిన్నమైలి అంజిరెడ్డి గెలుపొందారు. గెలుపు బిజెపి వైపు వెళ్తున్నాదని తేలడంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ముగిసిన మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వివరాలు ఇలా ఉన్నాయి..
పోలింగ్ వివరాలు..
మొత్తం పోల్ అయిన ఓట్లు – 2,52,029, మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు(Valid) – 2,23,343
మొత్తం చెల్లని ఓట్లు(In valid) – 28,686
మొదటి ప్రాధాన్యతలో అభ్యర్థుల ఫలితాలు
1.అంజిరెడ్డి చిన్నమైల్ (బిజెపి) – 75675
2.నరేందర్ రెడ్డి వుట్కూరి ( కాంగ్రెస్) -70565
3.ప్రసన్న హరికృష్ణ (బి.ఎస్. పి) -60419
4.రవీందర్ సింగ్ – 2047
5.మహమ్మద్ ముస్తాక్ అలీ – 2701
6.యాదగిరి శేఖర్ రావు -3636
రెండవ ప్రాధాన్యతలో అభ్యర్థుల ఫలితాలు
1.అంజిరెడ్డి చిన్నమైల్ (బిజెపి) – 98637
2.నరేందర్ రెడ్డి వుట్కూరి ( కాంగ్రెస్) -93531
ఇదిలా ఉండగా మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బిజెపి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి గెలుపు ధ్రువీకరణ పత్రంను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు.


