కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రలు ఎమ్మెల్సీ ఫలితం కాంగ్రెస్, బీజేపీ మధ్యే అని తెలుస్తోంది. మంగళవారం ప్రారంభమైన ఈ నియోజకవర్గంలో 27న నిర్వహించిన పోలింగ్ లో మొత్తం 3.55 లక్షల ఓటర్లకు గాను మొత్తం 2.53 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో 28 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. 2.24 లక్షల ఓట్లను లెక్కించే ప్రక్రియ మంగళవారం మద్యాహ్నం ప్రారంభం అయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు. మొత్తం 21 టేబుళ్ల ద్వారా 11 రౌండ్లు కౌంటింగ్ కొనసాగనుంది. మొదటి రౌండ్ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6697, కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి 6673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5897 మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పలితాలు ఉత్కంఠతను రేకిత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి కంటే 24 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. 11 రౌండ్లు తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించినప్పటికీ 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థి సాధించే అవకాశం లేనట్టుగా స్పష్టం అవుతోంది. ఈ లెక్కన రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించడంతో పాటు ఎలిమినేషన్ రౌండ్ కూడా కొనసాగించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభం అయిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయినప్పటికీ నాలుగు జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో చెల్లని ఓట్లు తొలగించి తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించే ప్రక్రియ ప్రారంభం మాత్రం మంగళవారం మద్యాహ్నం 11.30 గంటల సమయంలో స్టార్ట్ అయింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్పష్టత రావాలంటే మాత్రం ఖచ్చితంగా మరో 24 నుండి 36 గంటల సమయం పట్టే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోరు? కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
RELATED ARTICLES


