మూడు రోజులుగా పడి ఉన్న విధి కుక్క(శునకం) మృతదేహం..
ఆదిలాబాద్, నిఘా న్యూస్: నిర్మల్ జిల్లా బాసర పాత గ్రామపంచాయతీ సమీపంలో గత మూడు రోజులుగా కుక్క (శునకం)మృతి చెందడంతో పట్టించుకునే నాథుడే కరువయ్యారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోనే వాటర్ ట్యాంక్ ఉండడంతో నీళ్లు పట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని పక్కనే కుళ్లిపోయిన కుక్క మృతదేహం వాసనను భరించలేకపోతున్నామని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోని మృతి చెందిన కుక్కను అక్కడినుండి తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.


