మంథని, నిఘా న్యూస్: స్థానిక చికెన్ మార్కెట్ లో కోళ్లు దొరకక జనం బుధవారం అవస్థలు పడ్డారు. మాఘ పౌర్ణమి కావడంతో పాటు బుధవా రం కలిసి రావడంతో వన దేవతలైన శ్రీసమ్మక్క-సారక్కలకు మొక్కులు చెల్లించుకోవటానికి ప్రజలు మార్కెట్లోని చికెన్ సెంటర్ల వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. పెద్ద ఎత్తున జనం కోళ్లను నుగోలు చేయడంతో మధ్యాహ్నం 12 వరకే మార్కెట్లోని దాదాపు 0 షాపుల్లో మొత్తం కోళ్లు అమ్ముడు పోవడంతో ఆ తర్వాత కోళ్ల సం మార్కెట్కు వచ్చిన వారు కోళ్లు లేక పోవడంతో అవాక్కయ్యారు. తర ప్రాంతాల నుంచి సైతం కోళ్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో అమ్మడానికి కోళ్ళు, చిక్కెన్ లేక మార్కెట్లో వ్యాపారులు సైతం ఖాళీగా కూర్చున్నారు. కోడి లేక, చికెన్ దొరకక ప్రజలు బేజార్ అయ్యారు. దీంతో కొంత మంది కోడి లేకుండానే వన దేవతలకు మొక్కులు చెల్లించుకొని ఆదివారం కోళ్ల కోసుకోవటానికి సన్నాహాలు చేసుకున్నారు. దీంతో మార్కెట్ మధ్నాహ్నం నుంచి రాత్రి వరకు చికెన్ సెంటర్లు జనం లేక వెలవెలబోయాయి. ప్రతి ఆదివారం, బుధవారల్లో మంథని చికెన్ మార్కెట్లో సుమారు 2 టన్నుల వరకు కోళ్లను విక్రయిస్తుండగా ఈ రోజు మాత్రం మేడారం శ్రీసమ్మక్క- సారక్క మొక్కులతో దాదాపు 4 టన్నుల పైగా అమ్మకాలు కొనసా గాయి. దీంతో మధ్యాహ్నం వరకే కోళ్లు ఖాళీ అయ్యాయి. ఒక వైపు బర్ట్ ప్లూతో న్ తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచి నిన్న క్రమంలో జనాలు కోళ్ల కోసం ఎగబడ్డారు.


