Wednesday, March 4, 2026

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కళ తప్పిందా.?

కరీంనగర్, నిఘా న్యూస్:కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా నిత్య పూజలు అందుకుంటాడు. కొన్నిచోట్ల ప్రతిరోజు పూజలు కాకుండానే సంవత్సరానికి ఓసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కరీంనగర్ లోని ప్రధాన కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే బ్రహ్మోత్సవాలకు ఒకప్పటి వైభవం తప్పిందని కొందరు చర్చించుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో గతంలో కంటే ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం లేదని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

కరీంనగర్ నడిబొడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఐదేళ్ల క్రితం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ప్రత్యేక రోజుల్లో, ప్రతి శనివారం ప్రత్యేక పూజలు మాత్రమే నిర్వహించేవారు . కానీ 2022 నుంచి వెంకటేశ్వర స్వామికి ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలతో స్వామి వారికి పూజలు చేస్తున్నారు. కరీంనగర్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ కార్యక్రమాలకు తరలివస్తున్నారు.

అయితే గతంలో మంత్రిగా ఉన్న సమయంలో గంగుల కమలాకర్ బ్రహ్మోత్సవాల నిర్మాణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని కొందరు అంటున్నారు. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకు తాను హాజరై పర్యవేక్షించే వారిని చెబుతున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత శోభాయాత్రను ఘనంగా నిర్వహించేవారు. కరీంనగర్ కు పడమర దిశగా ఉన్న మార్కెట్ యార్డ్ గ్రౌండ్ నుంచి స్వామివారి ఆలయం వరకు వివిధ వేషాధారణలు, నృత్యాలు, ఆటపాటల మధ్య స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం ఉండేది. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో ఈ శోభాయాత్ర కార్యక్రమం హైలైట్ గా నిలిచేది. దీనిని చూడడానికి భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చే వారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమానిర్వాహనపై పట్టించుకోవడంలేదని అంటున్నారు.

2025 సంవత్సరంలో ఫిబ్రవరి 6న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులు తరలివస్తున్నారు. అయితే గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శోభాయాత్రను సాధారణంగా నిర్వహించారు. గతంలో హంగు ఆర్భాటాలతో నిర్వహించిన శోభాయాత్రను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంటున్నారు. కరీంనగర్ కు చెందిన మంత్రి ఉన్న ప్రభాకర్ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని కొందరు అంటున్నారు. అయితే ఈసారి కూడా శోభాయాత్ర ఉంటుందా లేదా అనేది చర్చ నియాంశంగా మారింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular