Wednesday, March 4, 2026

కరీంనగర్: చింతకుంటలో దారుణం: ఇల్లు ధ్వంసం, కుటుంబానికి బెదిరింపులు

కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ జిల్లా, చింతకుంట మండలం, ప్రగతినగర్ గ్రామంలో కలువల స్వర్ణలత గారి ఇంటిని కొందరు దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. మూడు రోజుల క్రితం, లావుడ్య వెంకటేష్, మరియు వారి కుటుంబ సభ్యులు లావుద్య విజయ, నిర్మల,శ్యామల, మరికొందరు వ్యక్తులు హఠాత్తుగా స్వర్ణలత గారి ఇంటిపై దాడి చేశారు. సుత్తి, గడ్డపార వంటి ఆయుధాలతో ఇంటిని పూర్తిగా పగలగొట్టారు. ఇంతటితో ఆగకుండా, బోరును, కరెంట్ మీటరును,ఇంటి పై రేకులను, షట్టర్ ను కూడా ధ్వంసం చేశారు.
ఇది వారి స్థలమని చెబుతూ, స్వర్ణలత గారి కుటుంబాన్ని తీవ్రంగా దూషించారు, బెదిరించారు. విక్టర్ పాల్, మాధవి లత,ఓధయ్య, రేషం యాదగిరి,దొండ మురళి,తాటిపల్లి వేణుగోపాల్,ముడుపు లక్ష్మీ నరసింహ చారి,గట్టు మహేష్, మరియమ్మ,కోమటి రమేష్,మొలుగు మారుతి, మేకల నారాయణ,ఒడ్డే కనకయ్య, బాలయ్య, సత్తు సాయి ములుమూరి శ్రీనివాస్ మరియు మరికొందరు గ్రామస్తులు దాడి చేసిన వారికి మద్దతుగా నిలిచారు. వారిని ప్రోత్సహించారు. ఈల దాడి చేసిన వారిని రక్షించడానికి పోలీస్ వారు వీరిపై చర్య తీసుకోకుండా ఉండటానికి మద్దతు గా చింతకుంట గ్రామానికి చెందిన పిట్టల రవీందర్ మరియు బైరిశెట్టి మధు వీరికి అండగా నిలిచి ఈ దాడి చేపియడం జరిగింది
ఈ దాడిలో స్వర్ణలత గారి కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో నిరాశ్రయులయ్యారు. ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రతి పైసా తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వర్ణలత గారి కుటుంబం వేడుకుంటోంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular