హుజురాబాద్, :నిఘా న్యూస్ తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల కార్మికుల అసోసియేషన్ నాయకత్వంలో. ఈనెల 28 మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు 11వ రాష్ట్ర మహాసభ. చలో హైదరాబాద్ ( హయత్ నగర్ ) డిపో, బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో. నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభ కరపత్రాలను హుజురాబాద్ బస్ స్టాండ్ ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొంటారు. పలు సమస్యలు. రిటైర్మెంట్ కార్మికులకు సూపర్ లగ్జరీ లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి మెడికల్ స్కీమ్ లో చేరని వారికి అవకాశం కల్పించాలి 2017లో వేతన సవరణ రావలసిన కార్మికులకు బకాయిలు చెల్లించాలి లీవుల ఇన్క్యాస్మెంట్ పైసలు చెల్లించాలి. పెన్షన్ లేని కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఆసరా పింఛన్లు కార్మికులకు అందించాలి రిటైర్మెంట్ కార్మికుడు చనిపోతే దహన సంస్కారులకు 30000 రూపాయలు అదే రోజు చెల్లించాలి హైదరాబాదులో అసోసియేషన్ భవన నిర్మాణానికి 1000 గజాల స్థలం కేటాయించాలి. అయ్యర్ పింఛన్లు కార్మికులకు అందవలసిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. చాలామంది కార్మికులకు పింఛన్ మంజూరు చేయడం లేదు. అప్పులు చేసి పిఎఫ్ బకాయిలు చెల్లిస్తున్నారు కొంతమంది కార్మికులు పింఛన్ మంజూరు కాకముందే చనిపోతున్నారు. ఇలాంటిపలు సమస్యలు పరిష్కరించాలని. మహాసభ నిర్వహించడం జరుగుతుంది కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి తవటం సంపత్ కుమార్ మార్త రవీందర్ వేల్పుల ప్రభాకర్ పేరాల లక్ష్మణ్ రావు గూడూరు మల్లారెడ్డి నరసయ్య లింగయ్య సత్యం. తదితరులు పాల్గొన్నారు
రిటైర్డ్ ఉద్యోగుల కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్’
RELATED ARTICLES


