Thursday, March 5, 2026

నేటినుండి మహిళల అండర్ -19- టి -20 ప్రపంచ కప్!

హైదరాబాద్, నిఘా న్యూస్: హిళల క్రికెట్లో మరో మెగా టోర్నమెంట్ కు సిద్ధమైంది. మలేసియా వేదికగా ఈరోజు జనవరి 18, అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతుంది.ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లు గా విడిపోయి పోటీ పడబో తున్నాయి. మలేసియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో కలిసి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ గ్రూప్‌-ఎలో ఉండగా.. నికీ ప్రసాద్‌ సారథ్యంలోని టీమిండియా ఆదివారం నాడు తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఢీ కొట్టనుంది.తెలుగు రాష్ట్రాల ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్‌ షకీల్, ద్రితి కేసరి ఈ టోర్నమెంట్లో ఆడుతు న్నారు. టోర్నీ తొలి మ్యాచ్‌ లో ఆస్ట్రేలియాతో స్కాట్లాం డ్‌,పోటీ పడబోతుంది.అయితే, మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ‘సూపర్‌ సిక్స్‌’కు చేరుకో నున్నాయి. ఈ 12 టీమ్స్ ను సూపర్‌ సిక్స్‌లో రెండు గ్రూప్‌లుగా చేస్తారు. గ్రూప్‌–1లో 6, గ్రూప్‌–2లో మరో ఆరు జట్లు ఉండనున్నాయి.

ఈ సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత గ్రూప్‌–1, గ్రూప్‌–2లలో తొలి రెండు స్థానాల్లో ఉన్న నాలుగు టీమ్స్ సెమీ ఫైనల్‌ కు అర్హత సాధించనున్నా యి. సెమీస్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ కు తలపడనున్నాయి.ఇక, సీనియర్‌ టీమ్ లో చోటు దక్కించుకోవాలని చూస్తున్న ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేం దుకు ట్రై చేస్తున్నారు. గత ఎడిషన్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు.. ఈసారి కూడా అదే ఆధిపత్యం కొనసాగించాల న్నారు.ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్‌ ఇండియాకు స్ట్రాంగ్ పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అయితే, ఇటీవల ఆసియాకప్‌ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయి లు కలిసి కట్టుగా ఆడితే టైటిల్‌ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం ఏం కాదు అంటున్నారు క్రికెట్ అభిమానులు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular