–ఆలయ అభివృద్ధికి పాటుపడతా
-ఆధ్యాత్మిక కేంద్రంగా బెజ్జంకి ఆలయం
-ధర్మకర్తల మండలి ఆదర్శంగా నిలబడాలి
-నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
బెజ్జంకి, జనవరి17(నిఘా న్యూస్)బెజ్జంకి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. శుక్రవారం, బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ,ఈ ఆలయాన్ని ప్రత్యేక గుర్తింపు పొందే ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తాను అని చెప్పారు. నూతన ధర్మకర్తల మండలి, ఆలయ అభివృద్ధి కోసం విశేష కృషి చేసి, ఆదర్శంగా నిలవాలనీ ఆయన పిలుపునిచ్చారు.
ధర్మకర్తల మండలి, ఆలయ అధికారులు, సిబ్బంది, దాతల సహకారంతో ఆలయానికి మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. ఆలయ విశిష్టతను, సంప్రదాయాలను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ధర్మకర్తల మండలి ముందుండాలి అని చెప్పారు.
ఈ సందర్భంగా నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జెల్ల ప్రభాకర్ ఆలయ చైర్మన్‌గా ప్రమాణం చేయగా, ధర్మకర్తలుగా బర్ల రాజయ్య, బెజుగం విశ్వప్రసాద్, గుబిరె చంద్రయ్య, దోనె శ్యాం, ఐయలేని జయ, బోనగిరి ప్రభాకర్ (పొట్లపల్లి) ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జయదేవ్ ఆర్య, డిపిఎం కరుణాకర్, ఏపీఎం నరసయ్య, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, ఈవో విశ్వనాధ్ శర్మ, ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, పార్టీ నాయకులు సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, శీలం నర్సయ్య, కె. బాబు, కోటి, పి. ఉమేష్, పి. పోచయ్య, బి. రాజు తదితరులు పాల్గొన్నారు.


