నర్సంపేట, నిఘా న్యూస్:రాజరాజేశ్వర స్వామి కోడెలను రైతుల పేరిట తీసుకువచ్చి అమ్ముకున్న ముగ్గురిని వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. గీసుకొండ సిఐ మహేందర్ కథనం ప్రకారం శ్రీ రాజరాజేశ్వర సొసైటీ పేరిట గోశాల నడుపుతున్న వెలగందుల రాజు కాంగ్రెస్ నాయకులు మాదాసి రాంబాబు ఈనెల 1న వేముల దేవస్థానం నుంచి లేగ దూడలు తీసుకొని వచ్చి కబేళాలకు తరలిస్తున్నారని వారిపై విశ్వహిందూ పరిషత్ పాటు పలువురు గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టారు అతనితో పాటు అనంతారం గ్రామానికి చెందిన మందస్వామి దొంగోడి మండలం చలపర్తి చెందిన పశునుటి శ్యాంసుందర్ కలిసి వారి కుటుంబ సభ్యులతో పాటు గీసుకొండ దుగ్గోడి మండలంలో తెలిసిన రైతుల నుంచి ఆధార్ కార్డులు భూమి పత్రాలు సేకరించారు అనంతరం వేములవాడ గోశాలకు వెళ్లి అక్కడి దేవాలయ అధికారుల సహకారంతో రైతుల ఫోర్జరీ సంతకాలు పెట్టారు రెండో విడతలు 66 కోడెలను గీసుకొండ మండలం గట్టు కింద పల్లి లోని మాదశి రాంబాబు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న భూమి పక్కన ఉన్న ఖాళీ స్థలం తరలించారు వాటిలో 28 కోడెలను అమ్ముకోగా మరో 26 కోడెలు వేములవాడ గోశాలకు తిరిగి అప్పగించారు అలాగే 3 కోడలు చనిపోగా మిగిలిన మరో 9 కోడెలు స్వాధీనం చేసుకున్నామని దీనికి బాధ్యులైన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
రాజన్న కోడెలు అమ్ముకున్న కేసులో ముగ్గురి అరెస్ట్
RELATED ARTICLES


