ఆలయ అభివృద్ది జరిగేనా?
రాజన్న సిరిసిల్ల (నిఘా న్యూస్):సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఎన్నో తరాలుగా అనంతగిరి గ్రామంలో భక్తుల పూజలు అందుకుంటున్న అనంతగిరి పోచమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి ఇంకా నత్త నడకన సాగుతుంది అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా అమ్మవారి మండపాన్ని నిర్మించడం స్లాబ్ పోసి వదిలేయడం జరిగింది. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ముఖ్యంగా డ్యామ్ కట్టన ఆనుకొని ఉన్న అమ్మవారి దేవాలయానికి వేలాది మంది భక్తులు ఆది శుక్రవారాలు అధికంగా దర్శించుకుంటారు వివిధ ప్రాంతాల నుండి మహారాష్ట్ర రాష్ట్రం నుండి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు. ఎంతో మహిమగల పోచమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ఆసౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయి. ఆలయానికి కానుకల రూపేణా ఆదాయం కూడా దండిగానే ఉంటుంది కానీ పోచమ్మతల్లి కి ఇప్పటివరకు కనీసం అమ్మవారి గర్భగుడిలో సంబంధించిన మండపంలో కూడా ఎలాంటి పనులు చేపట్టకపోవడం ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం దేవాదాయశాఖ పరిధిలో గల అమ్మవారి ఆలయం అబివృద్ది కి ఆటంకాలు ఏమిటని భక్తులు చర్చించుకొంటున్నారు ఇప్పటికైనా నియోజక వర్గ ఎమ్మెల్యే గారు చొరవ చూపాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.


