వములవాడ, నిఘా న్యూస్: తెలంగాణ లో అతి ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తుల కోరికలు నెరవేరుస్తున్న వేములవాడ రాజన్న నిత్య కళ్యాణ మండపం పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పదు ఎన్నో సంవత్సరాలుగా రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు చాలామంది వారి పిల్లలకు పెళ్లిళ్లు అయితే స్వామివారికి కళ్యాణం జరిపించుకుంటామని మొక్కుకుంటారు వారి కోరిక తీరిన వెంటనే వేములవాడకు విచ్చేసి రాజన్న సాధారణ మొక్కులు లతో పాటు స్వామివారి కళ్యాణం కూడా చేసుకోవడానికి సిద్ధపడుతుంటారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కళ్యాణోత్సవంలో చాలామంది పాల్గొనడం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది వారి కల్యాణోత్సవానికి ముందు భక్తులు వేచి వేచి ఉండాల్సిన కల్యాణ భవనం పగులు చూపడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడే విధంగా తయారైంది కనీస ప్రమాణీకాలు పాటించకుండా భక్తులు వేచి ఉండాల్సిన కళ్యాణ భవనం పగులు చూపిన దాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది నిత్యం వందల మంది స్వామివారి కల్యాణ భవనంలో కళ్యాణోత్సవాలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుపు కుంటారు కాబట్టి ముఖ్యంగా కార్తీక మాసంలో వ్రతాలు కల్యాణాలు ఎక్కువ జరుగుతాయి దీని దృష్టిలో పెట్టుకొని దేవాలయం అధికారులు కళ్యాణ భవనం పగులు చూపిన చోట వెంటనే మరమ్మతులు చేపించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు
కళావిహీనమైన స్వామి వారి నిత్యకళ్యాణ భవనం.. పగుళ్లు చూపుతున్న పట్టింపు లేదా..?
RELATED ARTICLES


