వేములవాడ, నిఘా న్యూస్:మంగళవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనాయిపల్లి యందు అవొపా వేములవాడ యూనిట్ ఆధ్వర్యంలో దాతలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం సహకారంతో 40 మంది విద్యార్థులకు సుమారు 50 వేల రూపాయలు విలువైన క్రీడా దుస్తులు,షూస్, టై, బెల్ట్,ఐడి కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆనంద రెడ్డి విద్యార్థులు చదువుతోపాటు ఆటలకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సదానందం మాట్లాడుతూ దీపావళి కానుక గా విద్యార్థులకు క్రీడా దుస్తులు మరియు ఇతర వస్తువులు ఇచ్చిన దాతలకు ఉపాధ్యాయులకు, ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన వేములవాడ ఆవోప వేములవాడ యూనిట్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు B. సదానందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రేష్మ ,13 వ వార్డ్ కౌన్సిలర్ గడ్డమీద లావణ్య శ్రీనివాస్, అవొపా వేములవాడ యూనిట్ అధ్యక్షులు వంగళ మహేశ్ ప్రధాన కార్యదర్శి ఆమెటి శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ మద్ది సత్యనారాయణ, ఉపాధ్యాయులు ప్రసాద్ లక్ష్మణ్ శ్రీనివాస్ రామస్వామి నీరజ కవిత రాణి పాల్గొన్నారు.
‘ఆవోపా’ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ..
RELATED ARTICLES


