Friday, March 6, 2026

విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా పై ఫోక్సో కేసు నమోదు

విద్యార్థినుల పట్ల, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు.

జిల్లాలో సత్పలితలు సాధిస్తూ మహిళలకు,విద్యార్థినులకు అండగ నిలుస్తున్నా జిల్లా షీ టీం.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,

రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్ :ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ లో గల గర్ల్స్ హై స్కూల్ లో సోమవారం రోజు జిల్లా షీ టీం సిబ్బంది మహిళ చట్టాలపై, షీ టీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా కొంత మంది విద్యార్థులు షీ టీం సిబ్బంది వద్దకు వచ్చి నరేందర్ అనే టీచర్ కొద్ది రోజులుగా క్లాస్ రూమ్ లో విద్యార్థునుల పట్ల బ్యాడ్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నడాని ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన జిల్లా షీ టీమ్ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లోటీచర్ నరేందర్ పై POCSO చట్టం క్రింద కేసు నమోదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు.

జిల్లాలో మహిళలను, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై 38 కేసులు,44 పెట్టి కేసులు నమోదు చేసి పోకిరీల ఆటకట్టిస్తు సత్పలితలు సాధిస్తూ జిల్లాలో మహిళలకు,విద్యార్థినులకు అండగ జిల్లా షీ టీమ్ నిలుస్తున్నదాని మహిళలు, విద్యార్థుకు నిర్భయంగా ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ గారు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా కానీ,పని చేసే ప్రదేశాల్లో కానీ,పాఠశాలలో,కళాశాలల్లో మహిళలను ,విద్యార్ధినులకు వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని , మహిళలు ,విద్యార్థినులు వేధింపులకు గురైనట్లయితే వెంటనే షీ టీం నెంబర్ 87126 56425 కి పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అని తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular