వేములవాడ, నిఘా న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చెందిన గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ (గోపా) వారి ఆధ్వర్యంలో సభ్యులందరూ అడెల్లి పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు,అనంతరం వారందరు వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా గోపా అధ్యక్షులు దూలం సంపత్ గౌడ్ మాట్లాడుతూ గోపా ను మరింత ముందుకు తీసుకెళ్లి,అభివృద్ధి చేయడానికి పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే గోపా సభ్యుల పైన, ప్రజలందరి పైన పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గోపా పట్టణ అధ్యక్షులు దూలం సంపత్ గౌడ్, జిల్లా కార్యదర్శి పులి రాజు గౌడ్, పులి రాంగోపాల్ గౌడ్, వికృతి అంజయ్య గౌడ్ బాలుసాని, తిరుపతి గౌడ్ రేణుక మాత గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం రవి చంద్ర గౌడ్, కార్యదర్శి వెంగళ శ్రీకాంత్ గౌడ్, పొన్నం శ్రీధర్ గౌడ్, మల్లేశం,బత్తిని ఎల్లా గౌడ్,ఎగోళ్ళపు శ్రీనివాస్ గౌడ్ మరియు గోపా సభ్యులు పాల్గొన్నారు.
వన భోజనాలకు వెళ్లిన ’గోపా‘ సభ్యులు
RELATED ARTICLES


