Tuesday, March 3, 2026

రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అన్నదానం

వేములవాడ, నిఘా న్యూస్: దక్షణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా 89వ రోజు సందర్భంగా శాశ్వత దాతలు నాగుబోతు రవీందర్ జ్యోతి(భాను ఏజెన్సీస్)వారి మరియు సంవత్సర దాతలు తోట లక్ష్మి, పబ్బ విశాల పూర్ణిమ పవన్ దంపతుల, కొండ కనుకయ్య కళావతి దపతుల, మల్కపురం ప్రశాంత్ మమత దంపతుల, గంగపురం భారత్వాజ్(సూరజ్ టైలర్), కూరగాయల శాన్ష్రాయ్ మౌర్య, గార్ల సహకారాలతో ఈ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పార్కింగ్ స్థలంలో 70మంది అన్నర్థులకు పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ నిర్వాహకులు తోట లహరి రాజేష్ అన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయుటకు గాను ఇతర సేవ కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకునేవారు ట్రస్టు నెంబర్ 8919376459,ను సంప్రదించాల్సిoదిగా కోరారు, ఇట్టి సేవ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తోట లహరి రాజేష్, ఎద్దండి రాజు, తోట రాము, తదితరులు పాల్గొన్నారు,

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular