Friday, March 6, 2026

పీఆర్టీయూ కాటారం మండల కార్యవర్గం ఎన్నిక..

భూపాలపల్లి, నిఘా న్యూస్ :భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శ్రీ హర్షిత డిగ్రీ కళాశాల ఆవరణలో పీఆర్టీయు కాటారం మండ ల నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పిఆర్టియు మండల అధ్యక్షుడిగా,ఆంగోతు రవీందర్, ప్రధాన కార్యదర్శి గా అనపర్తి తిరుపతి, అసోసియేట్ అధ్యక్షులుగా సతీష్, మండల మహిళా ఉపాధ్యక్షులుగా ఎస్ శైలజ, మండల మహిళ కార్యదర్శి గా జి, గీత, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, జిల్లా ఎన్నికల పరిశీలకులు రేగురి సుభాకర్ రెడ్డి, తెలిపారు..

నూతనంగా ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శులను జిల్లా సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిఆర్టియు జిల్లా అధ్యక్షులు రేగురు సుభాకర్ రెడ్డి, మాట్లాడు తూ..317 GO వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులను వారి యొక్క స్థానిక జిల్లాలకు పంపించే విధంగా, సిపిఎస్, విధానాన్ని రద్దుపరిచి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల కొరకు కృషి చేస్తానని జిల్లా పిఆర్టీయు నాయకులు రేగురీ సుభాకర్ రెడ్డి, అన్నారు..

కాటారం మండల పిఆర్టీయు ,టీజీ నూతన అధ్యక్షులు అంగోతు రవీందర్,మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు తమ ఎన్నికకు సహకరిం చిన జిల్లా అధ్యక్షులు, రేగురి సుభాకర్ రెడ్డి, మండల ఉపాధ్యాయి ని,ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular