గల్ఫ్ బోర్డు జీవో విడుదల చేసిన ప్రభుత్వం
గల్ఫ్ కార్మికుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యెక ధన్యవాదాలు
గల్ఫ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జీవో విడుదల చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు..రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది..ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే నిన్నటి రోజున గల్ఫ్ కార్మిక సంక్షేమ కోసం ప్రభుత్వం జీవోను విడుదల చేసింది..ప్రధానంగా గల్ఫ్ లో మరణించిన మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి..ఈ భారత దేశంలోనే ఏరాష్ట్రంలో కూడా అమలు చేయకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది..అని అన్నారు


