– పోల్ వైర్లకు కనెక్షన్ ఇచ్చి ఇంటి నిర్మాణంకు సరఫరా
-ప్రముఖుల ప్రోధ్బలం ఉందనే వాదనలు
-‘సెస్’ దృష్టికి రావడంతో కనెక్షన్ కట్
వేములవాడ, ఆగస్ట్ 28, (నిఘా న్యూస్) వేములవాడ పట్టణంలోని కోనాయిపల్లి వెళ్లే రహదారి వద్ద ఉన్న భీమేశ్వర గార్డెన్ కు సమీపంలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణంకు యదేచ్ఛగా సరఫరా చేస్తున్న విద్యుత్ కనెక్షన్ ను సెస్ సిబ్బంది తొలగింపజేశారు. ఈ ఇంటి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి గత కొద్ది రోజులుగా అక్రమంగా పోల్ వైర్లకు కనెక్షన్ ఇచ్చి విద్యుత్ వినియోగంకు పాల్పడుతున్నారు. ఇట్టి విషయం సెస్ దృష్టికి రావడంతో వెంటనే అక్రమంగా విద్యుత్ వినియోగంకు పాల్పడుతున్న ఇంటి నిర్మాణం వద్దకు వెళ్లి కనెక్షన్ వైర్లను కట్ చేశారు ఇదిలాఉంటే ప్రముఖుల ప్రోద్బలంతోనే ఇంటి నిర్మాణంకు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అక్రమంగా విద్యుత్ వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం..
(-సెస్ ఏఈ )

ఎవరైనా గృహ నిర్మాణ అవసరాలకు అక్రమంగా విద్యుత్ ను వినియోగిస్తే చర్యలు తప్పవని సెస్ ఏఈ హెచ్చరించారు. విద్యుత్ అవసరం కోసం సంబంధితగృహ నిర్మాణ అనుమతి పత్రాలతో మీటర్ కోసం సెస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే గత కొద్ది రోజులుగా అక్రమంగా ఇంటి నిర్మాణంకు ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగించారో, ఆ యూనిట్లపై అదనంగా మూడు రేట్లు పెనాల్టీ వేస్తామని తెలిపారు.


