హైదరాబాద్, నిఘా న్యూస్:ఇటీవల ఖమ్మం పర్యటన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కాగా శనివారం ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఆయన తెలంగాణకు చేరుకోను న్నారు.వచ్చి రాగానే తన నివాసం లో పలువురు ఉన్నతాధికా రులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీతో పాటు వివిధ కార్పొరేషన్‌లపై సీఎం సమీక్ష చేయనున్నారు.
ఇందుకోసం రేవంత్ అధ్యక్షతన రేపు ఐటీసీ కోహినూర్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రభుత్వ పాలనపై ఈనెల 19 నుంచి వరుస సమీక్షలు నిర్వహించను న్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి వచ్చి రాగానే ఢిల్లీ పర్యటన చేయడం.. టీపీసీసీ చీఫ్, మంత్రి వర్గ విస్తరణ అంశాలు చర్చించ డానికి అని జోరుగా వార్తలు వస్తున్నాయి


