హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తోన్నాయి. కుండపోత వర్షాలకు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది.గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 70 వేలు, ఔట్‌ఫ్లో 37,267 క్యూసెక్కులుగా ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.420 మీటర్ల వరకు నీరు చేరాయి.నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీ లుగా ఉంది. జూరాలకు వరద ప్రవాహం పెరగడం తో.. ఆ ప్రాజెక్టు నిండుకుండ లా మారింది.దీంతో ప్రాజెక్టును చూసేందు కు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జూరాల నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్న దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు…
జూరాలకు చేరిన భారీ వరద :గేట్లు ఎత్తివేత
RELATED ARTICLES


