- చేతులెత్తేస్తున్న లీడర్, క్యాడర్
- పార్టీకి ఏం చేశారని కావ్యకు టికెటిచ్చారంటూ ప్రశ్నలు
- బీఆర్ఎస్ శ్రేణులకు టార్గెట్గా మారిన సీనియర్ నేత
- పార్టీ మారిన కడియం శ్రీహరిపై ఆగని ట్రోలింగ్!
- సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్యతీరేకత… వాట్సాప్లో రచ్చ
వరంగల్ (నిఘా న్యూస్) : గులాబీ పార్టీ వీడి హస్తం గూటికి చేరిన కడియం శ్రీహరికి ఎదురీత తప్పడంలేదు. సొంత పార్టీ నేతలు, క్యాడరసహకరించకపోగా కారు పార్టీ నేతల నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కూతురు కావ్య గెలుపు కష్టతరంగానే మారింది. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందని ఎంపీ టికెట్ ఇచ్చారని సొంత పార్టీ నేతలే విమర్శి స్తున్నారు. సోషల్మీడియా వేదికగా రచ్చరచ్చచేస్తున్నారు. మరోవైపు కడియం రాకను కాంగ్రెస్ పార్టీ ఆశావహులు సైతం జీర్ణించుకోలేకపో తున్నారు. కావ్య ప్రచారంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సహ కరించకపోవడం కడియం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి రంగంలోకి దిగి కావ్య గెలుపునకు సహకరిం చాలని, వరంగల్ సీటు ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోవద్దని జిల్లా నేతలకు సూచించినట్లు తెలిసింది. పార్టీ నేతలను మ్యానేజ్ చేసినా క్యాడరసహకరించాలని, ప్రజలు సైతం అభ్యర్థి వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటారని ఓ సీనియర్నేత అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.


