పెద్దపెళ్లి మార్చ్ 30,(నిఘ న్యూస్) :పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే గడ్డం వంశీకి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది.. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరుతుండడం, కడియంకి వరంగల్ టికెట్ ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై మాదిగ సామాజికవర్గం కోపంతో ఉంది. ఇప్పటికే నాగర్ కర్నూల్ – మల్లు రవి, పెద్దపల్లి – గడ్డం వంశీ ఇద్దరు మాలలకు టికెట్ ఇవ్వడం, ఇప్పుడు వరంగల్ – కడియం శ్రీహరి (బైండ్ల) పేరు రావడంతో మాదిగలకు అవకాశం కల్పించట్లేదని, మాదిగ సామాజికవర్గం కోపంతో ఉంటుందని పెద్దపల్లి అభ్యర్థిని మార్చి మాదిగ సామాజికవర్గం నేతకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తుంది.
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్
RELATED ARTICLES


