సంగారెడ్డి నిఘా న్యూస్): రాబోవు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ట్రాఫిక్ ఔట్ పోస్టును శుక్రవారం జిల్లా ఎస్పీ సందర్శించారు.పఠాన్ చెర్వు ట్రాఫిక్ ఔట్ పోస్ట్ ను సంద్శించిన ఎస్పీ తగు సూచనలు చేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో చెక్ పోస్టులల్లో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అధికారులు, సిబ్బంది 24*7 అందుబాటులో ఉండాలని, పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఎవరు నిర్లక్షం చేయరాదని అన్నారు.ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ. సంజీవ రావ్, పఠాన్ చర్వు డిఎస్పి రవీందర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రావణ్, బి.డి.యల్. ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ ఔట్ పోస్టును పరిశీలించిన జిల్లా ఎస్పీ
RELATED ARTICLES


