Monday, August 4, 2025

మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వారిద్దరి పేర్లకు కేబినెట్ తీర్మానం

హైదరాబాద్: మార్చ్13(నిఘా న్యూస్) తెలంగాణలో గవర్నర్‌ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం(Kodandaram), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌(Mir Ameer Ali Khan) నియమితులైన విషయం తెలిసిందే..మంగళవారం నాడు జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం వీరిద్దరి పేర్లను గవర్నర్‌కు తెలంగాణ ప్రభుత్వం పంపించనున్నట్లు సమాచారం..కాగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా మంత్రిమండలి నామినేట్ చేసింది. అయితే.. ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై.. దాసోజు, కుర్ర సత్యనారాయణలు హైకోర్టును అశ్రయించారు. గవర్నర్ తన పరిధిని అధిగమించారని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular