Friday, February 27, 2026

కథనభేరి సభకు కదలిరావాలి…

మాజీ ఎమ్మెల్యే రవిశంకర్

రామడుగు, (నిఘా న్యూస్): కరీంనగర్ జిల్లాలో ఈ నెల 12న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్లమెంట్ స్థాయి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కోరారు. రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ రామడుగు మండల స్థాయి ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ఎండగట్టాలని సూచించారు. కెసిఆర్ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో పార్టీ నేతలు కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీ.వి రామకృష్ణారావు, మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, ఎంపీటీసీ పోరం అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రామడుగు కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ లు వీర్ల వెంకటేశ్వర రావు, ఒంటెల మురళి కృష్ణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మర్కొండ కృష్ణ రెడ్డి, రైతు సభ్యులు కరుణాకర్, సంజీవ్ రావు, మామిడి తిరుపతి, జెడ్పీ కొఆప్షన్ సుక్రొద్దిన్, నాయకులు నాగి శేకర్, లక్ష్మణ్, మాజీ సర్పంచ్ లు ఎంపిటిసిలు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular